కోల్ బెల్ట్ ప్రతినిధి:
లిక్కర్ కేసులో అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కి మరో ఎదురు దెబ్బ తగిలింది.పార్టీ నుంచి పలువురు నాయకులు వెళ్లిపోతున్నారు.మంత్రివర్గం నుంచి రాజీనామాలు ఎదురుతలుగుతున్నాయి.బెయిల్ రావడంలేదు.పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి పార్టీతోపాటు,ప్రభుత్వంలో నెలకొంది.తాజాగా సీఎం క్రేజీవాల్ వ్యక్తిగత కార్యదర్శి తో మరో ఎదురుదెబ్బ తగిలింది.వ్యక్తిగత కార్యదర్శిగా నియామకమైన వైభవ్ కుమార్ నియామకంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టుగా డిపార్ట్మెంట్ అఫ్ విజలెన్స్ విభాగం గుర్తించింది.అయన నియామకం అయ్యేటప్పుడు అతనిపై పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసు వివరాలు తెలపలేదని విజిలెన్స్ విభాగం వెల్లడించింది.2007 లో నోయిడాలో ప్రభుత్వ ఉద్యోగిపై వైభవ్ కుమార్ దాడి చేసాడు. దాంతో అతనిపై పోలీస్ కేసునమోదయినది. క్రేజీవాల్ వ్యక్తిగత కార్యదర్శిగా నియామకం అయ్యేటప్పుడు కేసు వివరాలు వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో వెల్లడైనది. ఈ నేపథ్యంలో అతన్ని విదుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.ఇది కొంత మేరకు క్రేజీవాల్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన సంఘటన అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.