Home » వాడో మనిషి…నువ్వో మనిషివి…పో

వాడో మనిషి…నువ్వో మనిషివి…పో

కాంట్రాక్టర్లను మందలించిన ఎమ్మెల్యే
పనుల ఆలస్యంపై అసంతృప్తి
కోల్ బెల్ట్ ప్రతినిధి:
మంచిర్యాల జిల్లాలోని ఒక ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను మందలించిన సంఘటన జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.విశ్వసనీయ వర్గాల తోపాటు,పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన సమాచారం ఈ విదంగా ఉంది. కాంట్రాక్టర్లు చేస్తున్న అభివృద్ధి పనుల విషయంపై ఆ ఎమ్మెల్యే వారితో వేరు,వేరు సందర్భాల్లో చర్చించారని సమాచారం.కాంట్రాక్టర్లు చేస్తున్న పనుల గురించి అరా తీశారు.తన నియోజకవర్గంలో చేపట్టిన పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఆ ఇద్దరిని అడిగారు.ఇద్దరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సమాధానం విని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.పనుల ఆలస్యం కావడంపై అసహనం వ్యక్తం చేశారు.
సీనియర్ కాంట్రాక్టర్ పని తీరు ఇదేనా ???
నువ్వు ఒక సీనియర్ కాంట్రాక్టరువు. కాంట్రాక్టు చేసే పని విధానం ఇదేనా ???.ముందస్తు అనుమతులు,సాంకేతిక సమస్యలను ముందుగా పరిస్కారం చేసుకోకుండా ఎలా పనులు మొదలు పెట్టావు. ఆ మాత్రం తెలియదా నీకు.చేపట్టిన పనుల వలన నష్టపోయిన వారు కోర్ట్ కు వెళితే అభివృద్ధి సంగతి ఏమిటి. ప్రజలకు మేము ఏమని సమాధానం చెప్పుకోవాలి.ఇంకా ఎన్ని రోజులు ఆ పని చేస్తావు.తొందరగా పూర్తి చేసేయ్ అంటూ జిల్లాలో సీనియర్ అయినటువంటి కాంట్రాక్టర్ను తీవ్రంగా మందలించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
వాడో మనిషి…నువ్వో మనిషివి…
తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పని గురుంచి మరో సీనియర్ కాంట్రాక్టర్ ను మందలించాడు ఎమ్మెల్యే. ఇంకా ఎన్ని రోజులు ఆ పని చేస్తావు.పని ఎందుకు ఆలస్యం అవుతుంది.సీనియర్ కాంట్రాక్టర్ పని విధానం ఇదికాదు.అంటుండగానే తన నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తావన సదరు కాంట్రాక్టర్ తీసుకు రావడం జరిగింది. ఆ మాజీ ఎమ్మెల్యే పేరుతీయగానే తాజా ఎమ్మెల్యే ఒక్కసారిగా అసహనానికి గురయ్యాడు. వాడో మనిషి…నువ్వో మనిషివి…పో ఇక్కడి నుంచి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు ఎమ్మెల్యే .

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *