Home » ys jagan : వైఎస్ జగన్ తిరుపతి ఎందుకు వెళుతున్నాడో తెలుసా ?

ys jagan : వైఎస్ జగన్ తిరుపతి ఎందుకు వెళుతున్నాడో తెలుసా ?

ys jagan : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంకు ఉపయోగించే నెయ్యి కల్తీదని దేశమంతా తెలిసిపోయింది. లడ్డు ప్రసాదం విషయంలో వైఎస్సార్ సీపీ పరిస్థితి ఏపీ లో దయనీయంగా మారింది. కల్తీ నెయ్యి ఇప్పుడు వైసీపీ పునాదులను కదిలిస్తోంది. పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీ ఉనికికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు కోరి తెచ్చుకున్న వెంకన్న స్వామి లడ్డు గొడవ, మరోవైపు పార్టీ నాయకులు కండువా మార్చుకోవడం. ఈ నేపథ్యంలో జగన్ తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోడానికి నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యి విషయం తనకేమి తెలియదు అని వెంకటేశ్వర స్వామి కి చెప్పుకోడానికి ఒకరోజు ముందుగానే ఏడు కొండలను చేరబోతున్నారు జగన్.

శనివారం హిందూ దేవాలయాల సందర్శనకు జగన్ పార్టీ పిలుపునిచ్చింది. తాను హిందూ వ్యతిరేకిని కాదు అని చెప్పుకోడానికి జగన్ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోడానికి ఒకరోజు ముందుగానే ఏడుకొండలకు చేరుకుంటున్నారు. జగన్ తన మతం గురించి ఎక్కడ కూడా చెప్పుకోలేదు. అంతే కాదు మతం చర్చకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకన్న నెయ్యి పుణ్యమా అని ఇప్పుడు తన మతం తన పార్టీ కె ప్రమాదం తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో నేను అందరివాడిని అని చెప్పుకోడానికే తిరుమలకు వస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చి దర్శనం చేసుకొని వెళ్లిపోవడం కాదు. ఏకంగా ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు.

మాజీ సీఎం హోదాలో జగన్ తిరుమలకు వస్తున్నారంటే రాజకీయం ప్రకంపనలు ఏర్పడుతాయి. వైసీపీ నేతలు హడావుడి చేస్తారు. కానీ జగన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఆలయ నిర్వాహకులకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అంటూ డిక్లరేషన్ ఇవ్వాలి. అధికారంలో ఉన్నప్పుడు దర్శనం కోసం వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ఏమి అడుగలేదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లడ్డు ప్రసాదం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో తాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అంటూ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు జగన్ తాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అనే విషయాన్నీ ఒప్పుకుంటారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *