MLA House : తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత రాష్ట్రంలో రెండు దఫాలుగా కేసీఆర్ సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఇల్లు ను అన్నివసతులతో నిర్మించారు.
119 నియోజక వర్గం కేంద్రాల్లో క్యాంప్ కార్యాలయం తో కలిపి ఇంటిని నిర్మించారు. వేదం, శాస్త్రం, వాస్తు పద్దతులను పాటించడం కేసీఆర్ కు మరొకరు సాటిరారు. 119 నియోజక వర్గం కేంద్రాల్లో నిర్మించిన ప్రతి ఒక్కటి కూడా వాస్తు ప్రకారమే నిర్మించారు. గృహ ప్రవేశం కూడా వేదమంత్రాలతో చేపట్టారు. ఘనంగా కార్యకర్తలతో ఎమ్మెల్యేలు గృహప్రవేశం చేపట్టారు.
నారాయణపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నారాయణపేట జిల్లా కేంద్రంలోనిదే. 2020 జులై లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఘనంగా క్యాంప్ కార్యాలయం తో ఉన్న ఇంటికి గృహప్రవేశం చేశారు. 2023 లో నారాయణపేట స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పర్ణికా రెడ్డి విజయం సాధించారు.
ఓటమి తరువాత రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంను ఖాళీ చేసి వెళ్లిపోయారు. పర్ణికా రెడ్డి విజయం సాధించిన తరువాత క్యాంప్ కార్యాలయానికి వస్తారని నియోజకవర్గం ప్రజలు భావించారు. కానీ తాజా ఎమ్మెల్యే మాత్రం తన క్యాంప్ కార్యాలయాన్ని సమీప బంధువు అయిన మేనమామ శివకుమార్ రెడ్డి నివాసంలోనే కొనసాగిస్తున్నారు.
కానీ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉన్న క్యాంప్ కార్యాలయంలో మాత్రం తాజా ఎమ్మెల్యే అడుగు పెట్టడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాడని అందుకు వాస్తు దోషమే కారణమని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు రాని నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు సద్వినియోగం చేసుకుంటే బాగుంటదని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.