Home » mla : పరిపాలనలో దూకుడు పెంచిన ప్రేమ్ సాగర్ రావ్

mla : పరిపాలనలో దూకుడు పెంచిన ప్రేమ్ సాగర్ రావ్

mla : మంచిర్యాల నియోజక వర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కొందరు కప్ప గంతులు వేశారు. కానీ ప్రేమ్ సాగర్ రావ్ మాత్రం కాంగ్రెస్ జెండా నీడనే ఉన్నారు. తెలుగు దేశం కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పెద్దల అభిమానాన్ని పొందారు. ఆ విషయంలో పార్టీలో డబ్బున్న మహారాజులు, ఢిల్లీ వరకు పలుకుబడి ఉన్నవాళ్లు కూడా సాహసం చేయక పోవడం విశేషం.

కాంగ్రెస్ జెండాతోనే గెలవాలనే పట్టుదలతో ఉన్న ప్రేమ్ సాగర్ రావ్ ఎట్టకేలకు మంచిర్యాల నియోజక వర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. ఒకవైపు మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారు పార్టీకి చేసిన సేవలు, తాను అందించిన సేవలను అధిష్టానం పెద్దలతో పాటు, రాష్ట్ర పెద్దలకు కూడా వివరిస్తున్నారు. మంత్రి పదవి ఎప్పుడు వచ్చిన ఫరవాలేదు. కానీ నియోజక వర్గం అభివృద్ధి లో మాత్రం వెనుకడుగు వేసేది లేదంటూ దూకుడు పెంచారు ప్రేమ్ సాగర్ రావ్.

నియోజకవర్గం కేంద్రంలో నవంబర్ ఒకటి నుంచి రాత్రి పది దాటితే క్రమశిక్షణ చర్యలు ఉండేవిదంగా పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గంలో గంజాయి అనే పదం వినపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం దుకాణాలు కూడా రాత్రి పది గంటలవరకే ఉండాలని ఆదేశాలు జారీ చేయించారు. ఇదంతా కూడా శాంతి భద్రతలో ఒక భాగమైనది.

అదేవిదంగా మంచిర్యాల పట్టణంలోని దుకాణ సముదాయాల్లో అక్రమ కట్టడాలను తొలగించే పనిలో పడ్డారు. నస్పూర్లో కూల్చిన ఐదు అంతస్తుల అక్రమ కట్టడం పెద్ద సంచలనం అయ్యింది. పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలోని ప్రధానమైన రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. దుకాణం యజమానులు ముందర అదనంగా వేసుకున్న షెడ్ లను సైతం తొలగించే విదంగా చర్యలు చేపట్టారు. కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ వెనక్కి మాత్రం తగ్గడంలేదు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్.

తాజగా మద్యం మానివేయాలంటూ తన పార్టీ కార్యకర్తలను కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. మద్యం ముట్టని వారికే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ ఖరారు అవుతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ స్పష్టం చేశారు. పార్టీ, కార్పొరేట్ పదవులు కూడా మందు ముట్టని వారికే దక్కుతాయని తేల్చి చెప్పారు. ఇది ఒకరకంగా కత్తి మీది సామే అవుతుంది. పెద్దన్నగా చెప్పిన మాట పార్టీలో ఎందరికి చద్ది మూట అవుతుందో చూడాలి.

ఇది ఇలా ఉండగా పార్టీ లో కొందరు నాయకులు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం తో ఆయనకు ఒక మచ్చ పడిందనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు అక్రమ కట్టడాలు, గంజాయి, శాంతి భద్రతలు, మద్యం విషయాలను అమలు చేయడంలో కఠినమైన ఆదేశాలు ఇవ్వడంతో నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ స్పష్టమైన విధానం పై ప్రకటన చేయాలని నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *