పూర్తిగా ప్రేమ కథా చిత్రం
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
రాచాలా యుగంధర్ ప్రేమ కథ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఆ సినిమాకు “సీతా కల్యాణ వైభోగమే”పేరు పెట్టగానే ఆ సినిమా పూర్తిగా ప్రేమ కథా చిత్రమని తెలిసిపోయింది అభిమానులకు.అభిమానులు ఆశలకు అనుగుణంగా చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సతీష్ పరమవేద.కథకు తగినవిదంగా హీరోగా సుమన్ తేజ్ హీరోయిన్ గ గరీమ చౌహన్ లను దర్శక,నిర్మాతలు ఎంపికచేశారు.సినిమా నిర్మాణంకు సంబందించిన సన్నివేశాల్లో దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా నిర్మాత సహకరించాడు.ఏప్రిల్ 26న సినిమా విడుదల చేయనున్నామని నిర్మాత రాచాల యూగందర్ ప్రకటించడంతో టికెట్ బుకింగ్ కోసం అభిమానులు పరుగులుపెడుతున్నారు
ప్రేమ కథా చిత్రం ….
సీతా కల్యాణ వైభోగమే సినిమా పూర్తిగా ప్రేమ కథా చిత్రం కావడం విశేషం.ఇప్పటివరకు వచ్చిన ప్రేమ కథ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను నిర్మించినట్టు నిర్మాత ప్రకటించారు.హీరో,హీరోయిన్ మధ్య ప్రేమ మొదలైన విధానం కూడా ఆకట్టుకునే విదంగా ఉంటుంది. వీరి ప్రేమను అడ్డుకునే విధానంలో కూడా తీసిన సన్నివేశాలు ప్రేక్షకుల్లో కొంతసేపు ఆందోళనకు గురిచేస్తాయి.హీరో చేసిన పోరాటాల్లో కూడా ఎక్కడ కూడా డూప్ లేకుండా తీయడం జరిగిందన్నారు నిర్మాత.పాటల విషయంలో డాన్స్,సంగీతం ,డ్రెస్సింగ్ విషయాల్లో ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడలేదన్నారు.హీరోయిన్ సన్నివేశాలను కూడా అభిమానులు ,ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే చిత్రీకరించడం జరిగిందన్నారు.
విలన్ యాక్షన్ అదిరింది. …
సీత కల్యాణ వైభోగమే సినిమాలో విలన్ పాత్ర కోసం కాస్త రిస్క్ తీసుకోవడం జరిగిందన్నారు.విలన్ పాత్రలో గగన్ విహారి యాక్షన్ అద్బుతమన్నారు.హీరో తో పోరాటాల్లో కూడా విలన్ గగన్ విహారి డూప్ లేకుండా చేశాడన్నారు. సంగీతాన్ని చరణ్ అర్జున్, కెమెరామెన్ గ పరశురామ్,ఎడిటింగ్ ప్రభు చేశారన్నారు. నటులుగా నాగినీడు,శివాజీరాజా,ప్రభావతి,వెంకీ మంకీ నటన ప్రేక్షకులను ఆకట్టు కుంటుం దన్నారు. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తీసిన హాస్యపు సన్నివేశాలు ఈ సినిమాలో కడుపుబ్బ నవ్విస్తాయి.
.