Minister or collector : తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకుంటారు. అంతే కాదు ఏదయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక కూడా ఉంటది ఆ తల్లిదండ్రులకు. ఒక డాక్టర్, లేదా ఇంజనీర్ కావాలనుకుంటారు. ఎంత ఖర్చు అయినా మంచిదే కానీ ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఎవరు కూడా ఈ రోజుల్లో తమ పిల్లలు రాజకీయ నాయకులు కావాలని మాత్రం అనుకోరు. కలలో కూడా ఊహించరు. రాజకీయాల్లోకి వెళుతామంటే కూడా కన్నవారు అసలే ఒప్పుకోరు. కొడుకు రాజకీయాల్లోకి వెళుతామంటే ఒప్పుకునే వారు కొందరు ఉంటారు. కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, రాజకీయ ప్రవేశం చేస్తామంటే ఆ కుటుంబం ఒప్పుకోదు. కానీ ఆమె కన్నవారు మాత్రం ఒప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో వంగలపూడి అనిత ఎం.ఏ., ఎంఈడి. చదివింది. అధ్యాపకురాలిగా స్థిరపడింది. కానీ ఎందుకో ఆమె తెలుగుదేశం పార్టీకి ఆకర్శితురాలైనది. ఉద్యోగం చేస్తూనే మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యింది. దీనిపై వ్యతిరేకత రావడంతో 2009 లో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. తెలుగుదేశం పార్టీలో పూర్తి కాలపు నాయకురాలిగా పనిచేయడం ప్రారంభించారు.
2014 లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2019లో కొవ్వూరు నుంచి పోటీచేసి ఓటమిచెందారు. 2021 నుంచి ఆమె పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పాయకరావుపేట నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో అనిత రాష్ట్ర హోమ్ శాఖా మంత్రిగా భాద్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొంది.
ఇటీవల ఆమె ఒక మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని కోరికను వెల్లడించారు. ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో ఆమె తండ్రి అప్పారావు ఎదురు ప్రశ్న వేశారు. ఒకవేళ ఎమ్మెల్యే గ ఓటమి చెందితే నీది, నీ పిల్లల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. దింతో ఆమె తన మనసులో ఉన్న కోరికని అప్పుడు చెప్పేసింది. ఒకవేళ ఓటమి చెందితే నా పిల్లలను ఒక ఆరు నెలల పాటు మీ వద్ద ఉంచుకోండి. ఆ ఆరునెలల్లో నేను తప్పకుండ సివిల్ సర్వీస్ లో ఐఏఎస్ సాదిస్తాను. నా కోరిక కూడా అదే అంటూ తండ్రి అప్పారావుకు తెలిపింది. కానీ మొదటి ప్రయత్నంలో ఆమె ఐఏఎస్ ఎంపిక అవునో, కాదో చెప్పలేం కానీ, మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండో దఫా ఓటమి, మూడోసారి విజయం, కీలకమైన హోమ్ మంత్రి పదవి చేపట్టడం వెంట,వెంట జరిగిపోయింది.