Ankalamma pooja : రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ ఆ ఊరి ప్రజలు అక్కడి దేవతకు ఘనంగా ప్రతి ఏటా పూజలు చేస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా వర్షాలు కురవాలని కోరుతూ గ్రామపెద్దలు, వేద పండితులు, ప్రధాన పూజారులు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు అమ్మవారికి. ఇది వర్షాకాలంలో ప్రతి సంవత్సరం వర్షాల కోసం పూజలు చేయడం అక్కడ సంప్రదాయం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా శ్రీశైల మల్లికార్జున స్వామి మహా మహాక్షేత్రం పరిధిలోని గ్రామ దేవత అంకాళమ్మ అమ్మవారికి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, గ్రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించారు. మూల నక్షత్రం పురస్కరించుకొని లోక కల్యాణం కోసం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం తరుఫున అధికారులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
అంకాలమ్మ అమ్మవారికి వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేయడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. నూతన పట్టువస్త్రాలు, పసుపు. కుంకుమ, గాజులు, ఫలములు, పుష్పాలు, నైవేద్యంలతో అంకాళమ్మ అమ్మవారికి సమర్పించారు. ఎప్పటిమాదిరిగానే ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురవాలని, దేశ ప్రజలుసుభిక్షంగా ఉండాలని, జనులందరూ కూడ సుఖసంతోషాలతూ ఉండాలని కోరుతూ అంకాళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.