CITU : మంచిర్యాల జిల్లాల్లోని పలువురు అధికారులు గ్రామ పంచాయితీ కార్మికులపై అధిక పనిభారం మోపుతున్నారని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు ఆరోపించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్క రిం చాలని కోరుతూ సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగ రాములుతో పాటు సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ……
గ్రామాలను ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగిస్తున్న గ్రామ పంచాయితీ కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా వేదించడం సరికాదన్నారు. జిల్లాలోని పలువురు అధికారులు అకారణంగా విధుల నుంచి తొలగిస్తామని కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అదే విదంగా కార్మికులను పలు విధాలుగా విధింపులకు కూడా గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు సవరణలు చేసి సకాలంలో నిధులు, విధులు, నిర్వహణ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, నేటికీ అమలు కావడం లేదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గ్రామ పంచాయితీ కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి సంకె రవి , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమస ప్రకాష్, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు,యశోద, నాయకులు చల్లూరి దేవదాస్, అంబటి లక్ష్మణ్, సాగర్, సుధాకర్, లత పోసవ్వ, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

by