KCR BUS YATRA :వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రెండోసారి అధికారం చేపట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థులకుఇ చిక్కకుండా దూకుడు పెంచారు. గత ఎన్నికల మాదిరిగానే మరోసారి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తన సత్తా ఏమిటో ప్రధాన పార్టీలకు చూపించడానికి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగ పర్యటనలు చేస్తున్నారు. ఇడుపులపాయ నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటివరకు రెండువేల కిలోమీటర్లకు పైగా జగన్ బస్సు యాత్ర చేపట్టారు. ప్రతి రోజు ఒక జిల్లాలో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జగన్ బస్సు యాత్రకు ముందు సభలు, సమావేశాలు నిర్వహిస్తే ఫలితం అత్తెసరు మాదిరిగానే కనబడింది. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతం కావడంతో తెలంగాణ తాజా మాజీ సీఎం కేసీఆర్ కన్ను బస్సు యాత్రపై పడింది.
తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాద్యతను ముందుగా మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు పెట్టారు కేసీఆర్. అదే సమయంలో కూతురు కవిత జైలు కు వెళ్లడం జరిగింది. మరోవైపు తొంటి ఎముక విరిగి అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కె పరిమితం అయ్యారు. ఎన్నికల ప్రచార భాద్యతలు చేపట్టిన కేటీఆర్, హరీష్ రావ్ లతో అంతగా ఆశించిన ఫలితాలు కనబడలేదు.ఆ ఇద్దరి సారథ్యంలో పార్టీ మరింత వెనుకబడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారితోపాటు ఓడినవారు సైతం కారుదిగి వెళ్లిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పు కుంటున్నారో అంతుపట్టడంలేదు, దీంతో ఎట్టకేలకు వైసీపీ అధినేత జగన్ చేపట్టిన బస్సు యాత్ర ను కేసీఆర్ చేపట్టడానికి ముందుకు వచ్చారు.
బిఆర్ఎస్ అధినేత చేపట్టిన బస్సు యాత్రలో జనం స్పందన కనిపించింది.కొడుకు, అల్లుడు నిర్వహించిన సభలు, సమావేశాల కంటే జనం సంఖ్య అధికంగానే కనబడుతోంది. ఆయన ప్రసంగాలు కూడా కొంత మేరకు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించలేదు. ఈ యాత్రతో సమయం ఆదా కావడం, వేదిక ఖర్చు లేకపోవడం తో ఆశించిన ఫలితాలు వేగంగా అందుతున్నాయి. ఇద్దరు మాజీ మంత్రుల తో చప్పగా సాగినప్పుడు పార్టీ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. అధినేత కేసీఆర్ బస్సు యాత్ర విజయ వంతం కావడంతో బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
———————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
————————-