SRI SHYLAM : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి గాంచిన శ్రీ శైల మల్లికార్జున స్వామి పుణ్య క్షేత్రంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేధిస్తూ దేవాలయం కమిటీ, ఎండోమెంట్ అధికారులు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ వాడకంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా అపరిశుభ్రముగా మారింది. ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సీసాలు, సంచుల వాడకమే కనిపించింది. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాదారులు కూడా ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నారు. దింతో మరింత ఎక్కువైపోయింది ప్లాస్టిక్ వాడకం. శుభ్రం చేయడానికి ఆలయం సిబ్బంది సరిపోవడం లేదు. ప్లాస్టిక్ ను తొలగించడం సిబ్బందితో సాధ్యం కావడంలేదు. సరిపడేంత సిబ్బంది ఉన్నప్పటికినీ ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా కావడంతో సిబ్బంది సకాలంలో తొలగించలేక పోతున్నారు. ప్లాస్టిక్ తో అపరిశుభ్రంగా ఆలయం ఉండటాన్ని చూసిన భక్తులు కూడా పలు సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఎట్టకేలకి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు దిగివచ్చారు. ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్టుగా ప్రకటించారు. దుకాణదారులు, శ్రీశైలం వచ్చే భక్తులు ప్లాస్టిక్ వాడరాదని కోరారు. ప్లాస్టిక్ కు బదులుగా కాగితం లేదా జనుము తో చేసిన సంచులను మాత్రమే వాడాలన్నారు. తాగునీటి కోసం ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాలనే వాడాలని ఆలయ కమిటీ,ఎండోమెంట్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని తిరుమల ఏడుకొండలపై అమలుచేయడం విజయవంతం అయ్యింది. శ్రీ శైలంలో కూడా అధికారులు, ఆలయ కమిటీ పట్టుదలతో నిర్ణయాన్ని కఠినంగా అమలుచేసిన నేపథ్యంలో ప్లాస్టిక్ నిషేధం విజయవంతం అవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————