Home » KCR : కాంగ్రెస్ చేతికి చిక్కిన కేసీఆర్

KCR : కాంగ్రెస్ చేతికి చిక్కిన కేసీఆర్

KCR : భారత రాష్ట్ర సమితి కి రాష్ట్రంలో అధికారం కోల్పియిన తరువాత కష్టాలు తప్పడంలేదు. పార్టీ ముందుకు వెళ్ళినట్టే వెళుతుంది, మల్లి వెనుకకూ వెళుతోంది. కలిసి రాకపోవడంతో కష్టాల కంటే నష్టాలనే ఎక్కువగా రుచి చూడాల్సి వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఎదుర్కోడానికి ఎత్తుకు, పై ఎత్తులు ఎన్ని వేసినప్పటికీ ఫలితం కానరావడంలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ చేసిన ప్రసంగమే తార్కాణం. గురువారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు.

కేవలం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ గురించి మాట్లాడి చేతులు దులుపుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి నోరు మెదపక పోవడం శోచనీయం. బడ్జెట్ సమావేశాలకు వచ్చి కేసీఆర్ తనదయిన శైలిలో మాట్లాడుతారని రాజకీయ వర్గాలు ఎదురు చూశాయి. కానీ అందుకు విరుద్దంగా కేసీఆర్ ప్రసంగం జరగడం విశేషం. దింతో కేసీఆర్ కాంగ్రెస్ చేతికి చిక్కినట్టు అయ్యిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నతలెత్తింది. కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తారనే చర్చ వచ్చింది. కనీసం అసంతృప్తి వ్యక్తం చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ కు గొర్రెల పంపిణీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ అంశాలు ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ చేసిన ప్రసంగంలో కూడా అంత పసలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజు చేసిన ప్రసంగం తో అయినా ఆయన కొంతమేరకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉపశమనం కలిగించేది. కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడి, కేంద్ర బడ్జెట్ గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడక పోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఇక్కడే అడ్డుకట్ట వేయడానికే ప్రతిపక్ష నాయకుడి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాట్లాడి మమ అనిపించారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో రాష్ట్రానికి నష్టం జరిగినప్పటికీ కేసీఆర్ స్పందించలేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కి ప్రధాన అస్త్రమై కేసీఆర్ చిక్కినట్టు అయ్యింది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *