Home » BJP Fire : సోనియా ఆహ్వానంపై బగ్గుమన్న బీజేపీ

BJP Fire : సోనియా ఆహ్వానంపై బగ్గుమన్న బీజేపీ

BJP Fire : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఈ వేడుకలకు ఆమె వస్తారో ? రారో అనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పుడు ఆమె ఆహ్వానం మాత్రం ప్రతిపక్ష పార్టీ బీజేపీ కి ఆయుధం అయ్యింది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత ఆవిర్భావ వేడుకలకు వస్తే తప్పేమిటని అధికారపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆవిర్భావ వేడుకలను నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు కాషాయం నేతలు. మరోవైపు సోనియా గాంధీని పిలువడాన్ని కూడా ఏ హోదాలో పిలుస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు కాషాయం శ్రేణులు. సోనియాను 1500 మందిని బలితీసుకున్నందుకు పిలుస్తున్నారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఈ కార్యక్రమం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారా ? లేదంట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారా అని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పార్టీ పరంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మీ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసుకొని సోనియా గాంధీని సన్మానించుకుంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కాషాయం నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతున్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అంటున్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ వ్యతిరేకించారని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. సోనియా వేడుకలకు వస్తున్నారంటే, మహిళలు అంటే కాషాయం నేతలకు గౌరవం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్డంకి దయాకర్ అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *