cpm : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యదర్శి, సిడాం జంగుబాయి, పాయిరాల రాములతో పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఉంటున్న 158 ఆదివాసీ విద్యార్థులకు గదులు సరిపోక ఇబ్బందులకు గురవుతున్న విషయం సంబంధిత అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. అరకొర గదులతో విద్యార్థులు ఎలా సర్దుకుంటారని ఆయన ప్రశ్నించారు.
విద్యార్థుల అవసర నిమిత్తం ఏర్పాటు చేసిన వేడినీటి గ్లిజర్ చెడిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రాబోయే చలికాలంలో విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్లిజర్ మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత ఐటీడీఏ అధికారులు, ల్లా అధికారులు స్పందించి అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

by