Congress : ప్రజా గాయకుడు గద్దర్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగ బీబీపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లు గారి మహేష్ మాట్లాడుతూ గద్దర్ అవార్డు విషయంలో కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు సరిగా లేదన్నారు.
మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాయకుడిగా గద్దర్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన కృషి మరచిపోయారా అని మహేష్ గుర్తు చేశారు. రాష్ట్రము కోసం పోరాడుతున్న సమయంలో ఎందుకు అడ్డుకోలేదన్నారు. ఈ సందర్బంగ మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుతార్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.