cm attack bjp,brs : పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్. బీజేపీ. కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు తీవ్రంగా చేసుకుంటున్నారు. అవినీతి, పరిపాలన, హామీలు, నిర్లక్ష్యం వంటి అంశాలనే ప్రధానంగా ఎంచుకొని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బిఆర్ఎస్, బీజేపీ నేతలైతే ఏకంగా కాంగ్రెస్ పరిపాలననే లక్ష్యముగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇద్దరినీ డీకొంటున్నారు. కేవలం తన వందరోజుల పరిపాలన పైననే ఆధారపడి ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను వెంట వెంట తనదయిన శైలిలో తిప్పికొడుతున్నారు రేవంత్ రెడ్డి. రైతుల ఓట్లపై మూడు పార్టీలు ఆధారపడి ప్రజల్లోకి వెళ్లాయి. ప్రభుత్వం పంపిణి చేయాల్సిన రైతు బంద్ నే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేసుకొని ఆకట్టుకోడానికి బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపించిన నేపథ్యంలో రైతు బంధు పథకం తో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పక్షాలను ఒక్కసారిగా దెబ్బ కొట్టాడని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గులాబీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన నాటి నుంచి మొదలుకొని రైతు బందునే ప్రధాన ఆయుదంగా వాడుకున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్ లు కూడా రైతు బందు ఎందుకు ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి ని నిలదీయాలంటూ ఓటర్లను కోరారు. రేవంత్ రెడ్డి ఏమైనా తన జేబుల కెళ్ళి రైతు బందు ఇస్తున్నాడా, నిలదీయాలి మీరు అంటూ రెచ్చగొట్టే విదంగా మాట్లాడారు. బీజేపీ నేతలు కూడా రైతు బంధు గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ని ఇరుకున పెట్టే విదంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పరిపాలనతోనే రైతు బందు నిధులు రైతులకు జమకావడం లేదని కాషాయం నేతలు ఆరోపించారు.
రైతు బందు నే ప్రధాన అస్త్రంగా వాడుకొని దెబ్బ తీయాలనుకొన్నవి ప్రతిపక్ష పార్టీలు. అదే పథకంతో ప్రతిపక్ష పార్టీలను ఎదురుదెబ్బ తీశారు రేవంత్ రెడ్డి. ఎన్నికలకు కొద్ధి రోజుల ముందుగా రైతు బందు నిధులు విడుదల చేసి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఒక్కసారిగా ఇరుకున పెట్టారు. మే 5 తేదీ వరకు ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి బ్యాంకు లో జమ అయ్యాయి. మే 6 తేదీ నుంచి ఒక్కసారిగా ఐదు ఎకరాల పై బడి ఉన్న రైతులకు రైతు బందు నిధులు జమ చేసి ప్రతిపక్ష పార్టీల నోళ్లు మూయించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రధాన పార్టీలకు రేవంత్ రెడ్డిని డి కొట్టడానికి మరో ఆయుధాన్ని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.