Home » Gold : 2025, డిసెంబర్ నాటికీ తులం బంగారం ధర ఎంతవుతుందంటే ….

Gold : 2025, డిసెంబర్ నాటికీ తులం బంగారం ధర ఎంతవుతుందంటే ….

Gold : పేద కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి తులం బంగారం భారం కానుంది. పసిడి ధర చుక్కలను అంటుతోంది. రోజు,రోజుకు బంగారం ధర బగ్గుమంటోంది. నిన్న ఉన్న ధర రేపు ఉంటలేదు. ఎప్పుడు ఏ ధర పలుకుతుందో తెలియని పరిస్థితి మార్కెట్ లో నెలకొంది. ప్రస్తుతం బంగారం తులం అంటే పది గ్రాముల ధర మార్కెట్లో లక్ష రూపాయలకు సమీపంలో ఉంది. లక్ష దాటే అవకాశం ఉందనేది స్పష్టంగా కనబడుతోంది. పెళ్ళికి బంగారం ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలు బంగారానికి అంటుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర ఆకాశాన్ని తాకిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు కూడా కొంతవరకు తోడైనది. వీటన్నిటికీ అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాలు కూడా జతకలిసాయి. ఈ నేపథ్యంలోనే పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది.

ఏప్రిల్ 18 న పది గ్రాముల ధర 98 వేలు దాటింది. ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ అంచనాల మేరకు 2025, డిసెంబర్ నాటికీ తులం బంగారం ధర రూ : 1. 25 లక్ష కు చేరువయ్యే పరిస్థితి కనబడుతున్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *