Tea : అశ్వగంధం ఒక మూలికా. ఇది ఆయుర్వేదం అనే అందరికి తెలుసు. కానీ ఈ మూలికను ప్రతిరోజూ ఎదో ఒక రూపంలో తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిదంగా ఒక చిక్కటి చాయ్ ఈ మూలికతో తయారు చేసుకొని తాగితే శరీరానికి బోలెడన్ని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అశ్వగంధo రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భవతులు, పాలిచ్చే స్త్రీలు అశ్వగంధం టీ తాగకూడదు. నిద్రలేమిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిలను పెంచి, అలసటను తగ్గిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలను దూరం చేస్తుంది. శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా మార్చడంలో సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది.
గుండె సమస్యలు ఉన్నవారు, బిపి, షుగర్ ఉండి మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా మేరకు అశ్వగంధం టీ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.