Lemon : నిమ్మకాయతో సాధారణంగా పచ్చడి చేసుకుంటారు. వేసవిలో ఎక్కువగా నిమ్మరసం తాగుతారు. కొందరు ఉదయం పూట కాళీ కడుపుతో నిమ్మరసంకు తేనె కలుపుకొని తాగుతారు. కానీ కేవలం నిమ్మరసం తాగితే శరీరానికి నమ్మలేనంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వాటి గురించి తెలుసుకుందాం……
నిమ్మకాయ చాలా పోషకాలు కలిగిన పండు. రీరానికి అవసరమైన ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వెచ్చని నిమ్మకాయ నీరు తీసుకోవడం శరీరానికి తగినంత ద్రవం అందించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను సజావుగా ఉంచుతుంది. శరీరంలోని అవాంఛనీయ పదార్థాలను బయటకు పంపుతుంది. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.