Garlic : మసాలా దినుసులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో శరీరానికి బోలెడన్ని లాభాలు ఉన్నవి. ప్రతి ఒక్క దినుసు శరీరానికి ఉపయోగపడుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి మసాలా దినుసులను ఆయుర్వేద రూపంలో వాడుతున్నాం. ఈ దినుసుల్లో వెల్లుల్లి ఒకటి. ఈ వెల్లుల్లి ని ప్రతి రోజు ఒక రెబ్బ వాడితే ఎన్నో లాభాలు ఉన్నవని వైద్య పరిశోధనలో తేలింది.
వెల్లుల్లి వేగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం ఇందులో పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ ఒక వెల్లుల్లి పాయను పరిగడుపున తిన్నచో ఇన్‌ఫెక్షన్, జలుబు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. రక్త ప్రసరణ అదుపులో ఉంటుంది.
కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
హార్ట్ అటాక్ రాకుండా నిరోధిస్తుంది. తలనొప్పి రాకుండా నిరోధిస్తుంది. కాలేయం కు చాల ప్రయోజనం కలిగిస్తుంది.