Jani Master: చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనపై లైగింక వేదింపులకు పాల్పడ్డాడని, అత్యాచారం కూడా చేసాడని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. కొరియో గ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ లడఖ్ లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలతో లడఖ్ లో గాలింపు చేపట్టినట్టుగా సమాచారం.
ఫిర్యాదు చేసిన కొరియో గ్రాఫర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలి స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాల కోసం పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. జానీ మాస్టర్ కేసు విషయం చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.