gummadi : బూడిద గుమ్మడి కాయను పూజలో వాడుతారు. ఇంటి గుమ్మం ముందు దిష్టి కోసం కడుతారు. కానీ అందులో శరీరానికి కావలసినంత ఆరోగ్యం దాగి ఉందనేది చాలా మందికి తెలియదు. గుమ్మడి కాయ జ్యుస్ ప్రతి రోజు ఒక గ్లాస్ తాగిన వారికి వైద్యుడితో అవసరమే లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గుమ్మడి కాయ రసం తాగడం వలన శరీరానికి ఫోలేట్, పొటాషియం, కాల్షియం అందుతాయి. వీటితో పాటు బి-1,2, సి విటమిన్లు కూడా పుష్కలంగా అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జలుబు, దగ్గు, తుమ్ములను నివారిస్తుంది. బరువు తగ్గుతారు. బరువు పెరడమంటూ ఉండదు.
కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. మూత్ర పిండాలు ఆరోగ్యముగా ఉంటాయి. వేలకు ఆకలి అవుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. మలబద్దకం నివారిస్తుంది. వరుసగా నెల రోజుల పాటు ఈ రసం తగిన వారిలో టైప్ – 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందినట్టుగా ఆరోగ్య సర్వేలో తేలింది.