Usha uthup : ప్రముఖ గాయని ఉషా ఉతుప్ అసలు పేరు ఉషా అయ్యర్. ఈమె ముంబైలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. ఈమె అత్యంత ప్రజాదరణ పొందిన హిట్ పాటలు పాడారు. ఆమె హస్కీ వాయిస్, దేశ, విదేశాలలో కూడా లైవ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించారు. ఉషా ఉతుప్ కాంచీపురం చీరలు మాత్రమే ధరిస్తారు. పెద్ద బొట్టు, పూలు అమెకు చాలా ఇష్టం. భారతీయ పాప్ సంగీతంలో ప్రత్యేక స్థానం.
1968లో ఉష తన ఆంగ్ల ఆల్బమ్‌లను విడుదల చేశారు. ఈ ఆల్బమ్‌లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అదే సమయంలో, ఉష లండన్ పర్యటించారు. రేడియో ఇంటర్వ్యూ లో కూడా పాల్గొన్నారు.1970 నుంచి 1980 మధ్య కాలంలో సంగీత దర్శకులు ఎ.డి. బర్మన్, బప్పీ లహరి ల సంగీత దర్శకత్వంలో ఉష చాలా పాటలు పాడారు.
ఆమె తెలుగుతో సహా బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళం, 15 భారతీయ భాషలల్లో పాటలు పాడి ప్రేక్షకుల అభిమానం పొందారు. అదే విదంగా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళ, స్వాహిలీ, రష్యన్, నేపాలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్ భాషలల్లో కూడా పాటలు పాడి ఆదరణ పొందారు. గాయకురాలిగా సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2011 లో పద్మశ్రీ , 2024 లో పద్మ భూషణ్ అవార్డు తో సత్కరించింది.