Home » Golden Visa : చిరంజీవికి మరో గొప్ప గౌరవం ….

Golden Visa : చిరంజీవికి మరో గొప్ప గౌరవం ….

Golden Visa : తెలుగు సినీ పరిశ్రమ అగ్ర కథా నాయకుడు చిరంజీవికి అరుదయిన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చిరంజీవి గోల్డెన్ వీసా అందుకున్నారు. చిరంజీవి ఇటీవలనే పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఆందుకున్నారు. తాజాగా మరో గొప్ప గౌరవాన్ని అందుకోవడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. పలు రంగాల్లో ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ” గోల్డెన్ వీసా ” అందజేస్తుంది. ఇప్పడు చిరంజీవి ఆ గౌరవాన్ని అందుకోవడంతో చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక వర్గం, దర్శక, నిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చిరంజీవి కుటుంబ సభ్యలు అనందంతో మురిసి పోతున్నారు. ” గోల్డెన్ వీసా ” అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా ప్రముఖ నటుడు, మెగా స్టార్ చిరంజీవి చేరడం విశేషం. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమకు చెందిన షారుక్ ఖాన్, దుల్కర్ సల్మాన్, రజనీ కాంత్, అమలా పాల్, మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్ ” గోల్డెన్ వీసా ” అందుకున్న వారిలో ఉన్నారు. ఇప్పుడు వీరితోపాటు నటుడు చిరంజీవి చేరడంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *