Home » Top Heroyin : నిద్రలేని రాత్రులు… తిండి లేని రోజులు…ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్… కోట్లల్లో పారితోషకం…

Top Heroyin : నిద్రలేని రాత్రులు… తిండి లేని రోజులు…ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్… కోట్లల్లో పారితోషకం…

Top Heroyin : ఇష్టంతో కష్టపడితే ఏదయినా సాధించవచ్చు. సాధించాలనే పట్టుదల తప్పనిసరి. అనుకున్నది సాధించే వరకు కొందరు పట్టిన పట్టు విడువరు. ఎదో ఒకటి సాధించి జీవితంలో స్థిరపడాలి అనుకునేవారు ఉంటారు. అలాంటివారు కూడా ఇంటిని విడిచి వస్తారు. సుఖ, సంతోషాలను వదులు కుంటారు. ఆ కోవకు చెందిన ఆమె తన దేశాన్ని వదిలిపెట్టి, భారత దేశంలో అడుగుపెట్టింది. నిద్రలేని రాత్రులు గడిపింది. తిండి లేని రోజులను గుర్తుపెట్టుకోలేదు. తల్లి,దండ్రులతో ఆనందంగా గడిపిన రోజులను కూడా మరచిపోయింది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. ఆమె పారితోషకం కోట్లల్లో ఉంది. పట్టిన పట్టు విడువకుండ కసిగా చిత్రపరిశ్రమలో పోటీని తట్టుకొని నిలదొక్కుకొంది. తోటి హీరోయిన్లకు ఇప్పుడు ఆమె సవాల్ విసురుతోంది.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. పోటీ తత్వం కూడా ఎక్కువగానే ఉంటది. ఆమె ఒక విదేశీ యువతి. భారత చలన చిత్ర పరిశ్రమలో నటించాలనే లక్ష్యంతో ఇండియా కు వచ్చింది. ఆమె ఇండియాకు వచ్చేటప్పుడు కేవలం ఐదువేల రూపాయలతో అడుగుపెట్టింది. ఎన్నో కష్టాలను అనుభవించింది. నిద్రలేని రాత్రులు గడిపింది. తిండి లేని రోజులను కూడా గుర్తుపెట్టుకోలేదు.

ఆమె ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ” నోరా ఫతేహి “. చిన్న, చిన్న అవకాశాలతో ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఒక చిన్న గదిలో అద్దెకు ఉంది. ఆమెతో పాటు మరో తొమ్మిది మంది కూడా అదే గదిలో ఉండేవారు. బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో నటించి తిరుగులేని నటిగా ఎదిగిపోయింది. ఇప్పుడు నోరా బాలీవుడ్ లో తీరికలేకుండా గడిపేస్తుంది. ఒక్క సినిమాలో నటిస్తే ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందని బాలీవుడ్ లో పెద్ద టాక్.

కేవలం ఐదు నిమిషాల్లో నటిస్తే చాలు ఆమె పారితోషకం కోట్లల్లో ఉంటుంది. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కు నోరా తిరుగులేని నటి. తెలుగు సినిమాల్లో కూడా తన ప్రతిభను చాటుకొంది. డాన్స్ లో పెట్టింది పేరు. ఎంత కష్టమైనా షూటింగ్ సమయానికి చేరుకుంటుంది. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నటన, డాన్స్ తోనే ఆమె బాలీవుడ్ లో అందనంత ఎత్తుకు ఎదిగిపోయిందనే టాక్ .

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *