Home » లవ్ స్టోరీ సినిమాలు అంటేనే ఇష్టం

లవ్ స్టోరీ సినిమాలు అంటేనే ఇష్టం

Love Story Pictures :హర్రర్ సినిమాల జోలికి అస్సలు వెళ్ళను. ఇంకా చెప్పాలంటే యాక్షన్ సినిమాలంటే అంతగా ఇష్టం ఉండదు. ఫైటింగ్ ఎక్కువగా ఉన్న సినిమాలు పెద్దగా నచ్చదు. లవ్ స్టోరీ సినిమాలు అంటేనే ఇష్టం. ప్రేమ కథ సినిమాలు చూసిన బోర్ కొట్టదు . అందుకే మణిరత్నం నిర్మించిన ” గీతంగాలి ” సినిమా అంటే నాకు చాల ఇష్టమని తనకు గీతాంజలి సినిమా పై ఉన్న అభిమానాన్ని మనసులో దాచుకోకుండా చెప్పేసాడు ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ ప్రభాస్.

సాధారణంగా నేను ఎక్కువగా తీసిన సినిమాలన్నీ కూడా యాక్షన్ తో కూడుకున్నవే. ప్రాధాన్యత ఇచ్చింది కూడా యాక్షన్ సినిమాలకే. కానీ నాకు మాత్రం లవ్ స్టోరీ సినిమాలంటేనే చాల ఇష్టం. ప్రేమ కథ సినిమాల్లోనే ఎక్కువగా నీతి , భావం, సరదా, హాస్యం అన్నీ కలిపి ఉంటాయి. అందుకే అటువంటి సినిమాలు చూసిన బోర్ కొట్టదు. చూసిన సినిమానే మల్లి, మల్లి చూడాలని అనిపిస్తుంటది. షూటింగ్ లేనపుడు ఇంట్లో ఉంటె లవ్ స్టోరీ సినిమాలు చూసి ఆనందంగా గడుపుతాను. గీతాంజలి సినిమాలో హీరో,హీరోయిన్ పాత్రలతోపాటు ఇతర నటీ, నటుల పాత్రలు అభిమానుల రుచికి తగిన విదంగా తీర్చిదిద్దారు మణిరత్నం.

గీతాంజలి తరువాత ఎక్కువ సార్లు చూసిన సినిమా ” షోలే “. ఆ సినిమాలో ప్రేక్షకుల అభిరుచికి తగిన విదంగా ఆ రోజుల్లో తీయడం చాల గొప్ప విషయమని రెబల్ స్టార్ ప్రభాస్ స్పష్టం చేశారు .షోలే సినిమాలో గుర్రాలతో తీసిన సీన్ చాలా రిస్క్ తో కూడుకున్నది. నిజంగా అన్ని గుర్రాలను సేకరించడం కూడా కష్టంతో కూడుకున్న విషయం. గుర్రాల పై వెలుతూ ఫైటింగ్ చేయడం, దాన్ని షూటింగ్ చేయడం చాల గొప్ప విషయం. ఆ ఫైటింగ్ చేయడానికి కెమెరా మెన్, దర్శకుడు, ఇతర సాంకేతిక వర్గం ఆరోజుల్లో చేసారంటే వాళ్ళను అభినందించాలి. ఇప్పటి టెక్నాలజీ, అప్పటి టెక్నాలిజీ కి చాల తేడా ఉంది. ఏది ఏమైనా యాక్షన్ సినిమాల్లో నాకు చాల బాగా నచ్చిన సినిమా కూడా ” షోలే ”
————————–
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————

 

 

 

 

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *