Sini Actor : కొత్తగా సినిమా రంగంలో అడుగుపెట్టిన ఆ అందాల తార మొదటి ప్రయత్నంలోనే అభిమానులను సంపాదించుకొంది. తన నటనతో మెప్పించింది. అందాలు ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకొంది. తన ప్రతిభతో మొదటి సినిమా విజయవంతం అయ్యింది. ఇంకేముంది ఆ అందాల భామకు వరుసగా సినిమాలు చేతిలోకి వచ్చాయి. వెంట, వెంట సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడంతో తీరిక లేకుండా కెమెరాకు అతుక్కుపోయింది. తాజాగా రెండు సినిమాలు విజయవంతం అయ్యాయి. దింతో ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.
తాజాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ” మర్డర్ ముబారక్ ” తో పాటు ” యే వతన్ మేరె వతన్ “సినిమాలు రెండు కూడా విజయవంత మయ్యాయి. ఇప్పుడు మరో మూడు సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉంది ఆ అందాల నటి సారా అలీఖాన్. అనురాగ్ బసు దర్శకత్వంలో సారా అలీఖాన్ నటించింది. ఆమెతోపాటు హీరోగా ఆదిత్య రేయ్ నటించారు. ఆ సినిమా “మెట్రో ఇన్ దినో ” . ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమాతోపాటు టాప్ హీరో అక్షయ్ కుమార తో కలిసి నటించిన స్కె ఫోర్స్ సినిమా కూడా విడుదల చేయడానికి ఆ సినిమా పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు.
ముంబయి లో పుట్టి పెరిగిన సారా అక్కడే డిగ్రీ చదివింది. చదువుతున్న రోజుల్లోనే తన తల్లితో కలిసి ఫోటో షూట్ లో నటించింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సినిమా పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. సినిమా షూటింగ్ కు వెళ్లేంత వయసు కాదు. ముందు చదువు. ఆ తరువాతే ఎదో ఒక నిర్ణయం తీసుకుందువు అని తండ్రి సైఫ్ అలీఖాన్, తల్లి అమృత సున్నితంగా తిరస్కరించారు.
” కేదార్ నాథ్ ” సినిమాతో మొదటిసారి 2018 లో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగిచూడకుండా పరిశ్రమలో సందడి చేస్తోంది. తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. తన ఇన్ స్టా ఖాతాలో 4. 5 కోట్ల పైబడి అభిమానులను సంపాదించుకొంది. ఇంట్లో ఎలా ఉండాలి, బయటకు వెళ్ళేటప్పుడు ఎలా తయారవ్వాలి, షూటింగ్ లో ఎలా మెదులుకోవాలో అనే విషయాలన్నీ కూడా అమ్మ అమృత చూసుకుంటుంది.
నేను పెళ్లి చేసుకుంటాను. కానీ అత్తగారింటికి వెళ్ళను. నన్ను కట్టుకున్న అతను నా ఇంటికే రావాలి. నా పుట్టింట్లోనే ఉండాలి. అంటే నేను చెప్పింది ఈ పాటికే అర్థం అయ్యింది అనుకుంటున్నాను అంటూ అభిమానులకు చెప్పేసింది. తను కట్టుకున్న భర్త తన తల్లిదండ్రులతో ఉండకుండా ఆమె పుట్టింట్లో ఉండాలి. అంటే ఇల్లరికం వచ్చే వ్యక్తి అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆలా ఒప్పుకోని వ్యక్తితో పెళ్లి చేసుకోను అని ఇటీవల ఒక కార్యక్రమంలో ముక్కు సూటిగా చెప్పేసింది అందాల సొగసులు ఉన్న సారా అలీఖాన్.