sharook khan :సినిమా పరిశ్రమ షూటింగ్ సమయంలో చిన్న, చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ చిన్న తప్పులకు నష్టం కూడా తక్కువగానే ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చిన్న తప్పులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. తప్పులు కొన్ని సమయాల్లో డైరెక్టర్ వలన జరుగవచ్చు. ఇంకొన్ని నిర్మాతలు తీసుకునే నిర్ణయాల వలన కావచ్చు. మరికొన్ని తప్పులు హీరో, హీరోయిన్ వలన కూడా జరిగే అవకాశం ఉంటది. ఇంకా చెప్పాలంటే సాంకేతిక నిపుణుల వలన నష్టం వాటిల్లుతుంది షూటింగ్ సమయాల్లో. కానీ ఎవరివల్ల నష్టం జరిగినా పెద్దగా పట్టించుకోరు. నష్టాన్ని భరించాలని కూడా చెప్పారు.
కొందరు హీరోలు యాక్షన్ స్టంట్ లు సొంతంగా చేయాలని కోరుకుంటారు. మరికొందరు ఇతర హీరోలతో పోటీపడి చేస్తుంటారు.హీరోలు తీసుకునే సొంత నిర్ణయాల వలన నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సినీ పరిశ్రమలో. కానీ పరిశ్రమలోని నిర్మాతలు జరిగిన నష్టాన్ని పట్టించుకోరు. కానీ స్టంట్ చేసినప్పుడు హీరో శరీరానికి నష్టం జరిగితే మాత్రం తట్టుకోలేరు. హీరో ప్రాణాలు, ఆరోగ్యమే మాకు ముఖ్యమంటారు నిర్మాతలు.
షారూక్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్ లో డాన్-2 సినిమా నిర్మిస్తున్న విషయం ఆయన అభిమానులకు తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లో షారూక్ ఖాన్ చిన్న పొరపాటు చేశారు. ఆ పొరపాటు వలన రెండు కోట్ల అరవై లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ విషయాన్నీ స్వయంగా షారూక్ ఖాన్ తో కలిసి నటించిన నటుడు అలీ ఖాన్ ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
———————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
———————–