Padmasri kinnera mogilayya తనతో పాటు, తనపై ఆధారపడిన కుటుంబానికి పిరికెడు మెతుకులు పెట్టె భాద్యత దర్శనం మొగిలయ్య పై పడింది. తనకు వచ్చిన విద్య ఒకటే. కిన్నెర వాయించడం. ఆ కిన్నెరె ఆయన కుటుంబానికి ఆసరా అయ్యింది. కిన్నెర వాయిస్తూ ఊరూరా తిరుగుతూ పాటలు పాడాడు దానితో మొగిలయ్య ఇంటిపేరు దర్శనం కాకుండా కిన్నెర మొగిలయ్య గ మారిపోయాడు. తన తాత, తండ్రి నుంచి వారసత్వముగా వచ్చిన కిన్నెరనే వాయిస్తున్నాడు. కిన్నెర వాయిస్తూ పాటలు పాడగా వచ్చిన ఆదాయంతో కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు మొగిలయ్య. కుటుంబ భారం రోజు,రోజు కు పెరగడంతో కిన్నెర వాయించగా వచ్చిన ఆదాయం కూడా సరిపోవడం లేదు. అయినా కుటుంబాన్ని ఏదోవిదంగా నెట్టుకొస్తున్నాడు కిన్నెర మొగిలయ్య.
మొగిలయ్య పాటకు గుర్తుగా, ప్రతిభను మెచ్చి పలు సంస్థలు ప్రశంసించాయి. పురస్కారాలు అందజేశాయి. సత్కరించాయి. భారత ప్రభుత్వం కిన్నెర మొగిలయ్య ప్రతిభను గుర్తించింది. ప్రతిష్టాత్మకమైన పద్మ శ్రీ అవార్డుతో ఘనంగా సత్కరించింది. కానీ పద్మ శ్రీ అవార్డు పొట్ట నింపలేదు. భారత ప్రభుత్వం గుర్తించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోరి రూపాయలు నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించింది. ఆ రూపాయలతో ఇంటి స్థలం కొనుగోలు చేసి పిల్లల పెళ్లిళ్లు చేసాడు. మిగిలిన డబ్బులతో ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు సరిపోకపోవడంతో ఇంటి పనులు నిలిచిపోయాయి. ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు ఇంటి పనులు అసంపూర్తిగా ఉండటంతో మొగిలయ్య రోజువారీ కూలీగా వెళుతున్నాడు. కిన్నెర మొగిలయ్య హైదరాబాద్ లోని తుర్కయమంజాల్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో కూలి పనులు చేస్తు కనిపించాడు. తనకు ప్రతి నెల వచ్చే గౌరవ వేతనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే కూలి పనులు చేసుకుంటున్నానని తెలిపాడు. కూలి పనులు చేస్తున్న వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
———————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
———————–