Puspa -2 New Song : పుష్ప-2 ది రూల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం అంచనాలకు మించి కలెక్షన్లు సాధించి పెట్టింది. ఇప్పుడు వస్తున్న రెండో భాగం పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండో భాగంలో నటిస్తున్న అల్లు అర్జున్, రస్మిక లపై పాటను చిత్రీకరించారు దర్శక, నిర్మాతలు. ఇటీవల విడుదల అయిన గ్లిమ్ప్స్, టీజర్, పుష్ప పుష్ప అనే పాటతో సినిమా అంచనాలు భారీగా పెరిగారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కపుల్ సాంగ్ ను ” సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ’ పాటని వదిలారు. మొదటి భాగం లోని .‘నా సామి’ పాటను గుర్తు చేసేలా ఈ పాటని రూపిందించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, చంద్రబోస్ పాటలు రచించడం విశేషం.
‘‘వీడు మొరటోడు అని వాళ్లు వీళ్లు..
ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నా వాడు..
వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్నగానీ మహరాజు నాకు నా వాడు..
ఓ.. మాట పెలుసైనా..
మనసులా వెన్న రాయిలా ఉన్న
వాడిలోన దేవుడెవరికి తెలుసును నా.. కన్నా..
సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ..
మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ”
అంటూ సాగిన పాటను సినిమా రచయిత తన సాహిత్యంతో రంగరించారు.
అచ్చ తెలుగు భాష సొగసుతో అభిమానులను, ప్రేక్షకులను అలరించబోతోంది.