Home » T -20 World Cup : ప్రపంచం దృష్టి ఆ రెండు జట్లపైననే

T -20 World Cup : ప్రపంచం దృష్టి ఆ రెండు జట్లపైననే

T -20 World Cup : ట్-20 ప్రపంచ కప్ కోసం ఈ సారి 20 జట్లు పోటీలో ఉన్నాయి. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలకు ఏర్పాటు చేసింది అమెరికా క్రికెట్ బోర్డు. ప్రతి గ్రూప్ లో ఐదు జట్లు పోటీలో పాల్గొంటాయి. కానీ ప్రపంచం మొత్తం మాత్రం ఆ రెండు జట్ల పోటీ నే చూడటానికి ఇష్టపడుతున్నాయి.

గతంలో కంటే ఈ పోటీల్లో 20 జట్లు ప్రపంచ కప్ కోసం పోటీపడటం విశేషం. గ్రూప్ కు ఐదేసి జట్లు పోటీ పడుతుండగా, నాలుగు గ్రూప్ లుగా విభజించారు. నాలుగు గ్రూప్ లల్లో ” గ్రూప్ ఏ ” జట్టు లో చేరిన రెండు జట్లపై ప్రపంచంలోని క్రీడాభిమానుల దృష్టి పడింది. “గ్రూప్-ఏ ” జట్టులో టీం ఇండియా జట్టుతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లు తలపడనున్న ఆటను చూడటానికి వేయి కళ్ళతో క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. జూన్ తొమ్మిదిన భారత్, పాకిస్తాన్ జట్లు న్యూ యార్క్ లో తలపడబోతున్నాయి.

రోహిత్ శర్మ సారధ్యంలో ఇండియా టీం బరిలోకి దిగింది. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లతో కలిసి యువ ఆటగాళ్లు ప్రపంచ కప్ సాధించడానికి రంగంలోకి దిగారు. టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, జైస్వాల్, రోహిత్ లు పటిష్టంగా ఉన్నారు. పంత్, సాంసన్ లు వికెట్ కీపర్లు గ తమ సత్తా చాటబోతున్నారు. ఈ ఇద్దరు తాజాగా ముగిసిన ఐపీఎల్ లో తమ ప్రతాపాన్ని చాటారు. ఆల్ రౌండర్ ఆటగాళ్లు హార్దిక్, శివమ్ దూబే, అక్షర్, జడేజా లు బ్యాటింగ్ తో తమ ప్రతాపాన్ని చూపబోతున్నారు. బుమ్రా పేస్ బౌలింగ్ తో, కుల్దీప్, చాహల్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేయడానికి సిద్ధమయ్యారు.

2021 టోర్నీలో సెమిస్ వరకు వెళ్ళింది పాకిస్తాన్ జట్టు. 2022 లో ఫైనల్ వరకు వచ్చి ఆశలు అడియాశలు చేసుకుంది. తాజా ప్రపంచ కప్ పోటీలో బాబర్ అజమ్ బృందం చాలా కసితో అమెరికా వచ్చింది. కప్ తోనే మాతృభూమికి వెళ్లాలనే పట్టుదలతో పోటీకి సిద్దమైనది. పటిష్టమైన అనుభవం ఉన్న మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, షహీన్‌ షా లు జట్టుకు అండగా నిలిచారు. నసీమ్‌ షా, రౌఫ్‌ తోపాటు స్పిన్నర్లు షాదాబ్‌, అబ్రార్‌, ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో పేరున్న క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుకు అండగా నిలిచారు.

 

 

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *