Actor Roja : ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. నోరు జారిన మనిషి, ఆయుధం జారవిడిచిన మనిషి ఒక్కటే అంటారు పెద్దలు. అధికారం ఉందని ఇష్టం వచ్చిన పద్దతిలో నోరు పారేసుకుంటే అందుకు తగిన ప్రతిఫలాన్ని ఎదో ఒకరోజు అనుభవించి తీరాల్సిందే. ప్రముఖ తెలుగు సినీ నటి, ఏపీ మాజీ మంత్రి రోజా మంత్రి పదవి రాగానే తట్టుకోలేకపోయింది. ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంది. ఎవరిని తిట్టాలో, ఎవరిని తిట్టకూడతో అని ఆలోచించకుండా మాటలు విడిచి పెట్టింది. అధికారం రాగానే అడ్డు, అదుపు లేకుండా పోయింది. ఆమె ఇటీవలి ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఓటమి పలు కావడానికి ప్రధాన కారకులు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం…..
రోజా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నగరి నుంచి గెలిచించి. మంత్రిగా భాద్యతలు చేపట్టింది. మంత్రిగా నియామకం అయిన తరువాత ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రోజా కుటుంబాన్ని సాదరంగా తన ఇంటికి ఆహ్వానించారు. తోటి నటి కాబట్టి గౌరవించారు. రోజాతో పాటు కుటుంబ సభ్యులను సత్కరించారు. అంతగా గౌరవించిన చిరంజీవిని ఒక సందర్భంలో ఆయనపై అవాకులు, చవాకులు విసిరింది. గతాన్ని మరచిపోయింది. అక్కడ చిరంజీవి అభిమానులు ఆమె మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిదంగా సూపర్ స్టార్ ప్రముఖ నటుడు రజనీ కాంత్ పై కూడా రోజా నోరు పారేసుకున్నారు. రజనీకాంత్ సినిమాలు సరిగా ఆడటం లేదు. ఆయన సినిమాల్లో క్వాలిటీ తగ్గింది. రజనీకాంత్ ఇమేజి కూడా తగ్గిందని నోరు జారింది. దీనితో రజనీకాంత్ అభిమానులు సైతం రోజా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా తక్కువ అంచనా వేసింది రోజా. అప్పటికే చిరంజీవి గురించి నిర్లక్ష్యముగ మాట్లాడిన రోజా పవన్ కళ్యాణ్ ను కూడా వదిలిపెట్టలేదు. జగనన్న వెంట్రుక కూడా పవన్ కళ్యాణ్ పీకలేడు లేడు అంటూ మాటలు విడిచిపెట్టింది. అంతే కాదు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేడు పవన్ కళ్యాణ్ అంటూ నోరుపారేసుకుంది.
ముగ్గురు అగ్రనటులపై ఇష్టానుసారంగా మాట్లాడిన రోజాకు ఆ ముగ్గురు అభిమానులు ఇటీవలి ఎన్నికల్లో ఏకమైనారు. అందులో నగరిలో తమిళ ఓటర్లు ఎక్కువ . దానికి తోడు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా తోడైనది. ఈ నేపథ్యంలో ఆమెకు రాజకీయ పతనం తప్పలేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.