Yamudu Naani : వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికి” సినిమా ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎందుకో గాని ఆ సినిమా చిత్ర బృందం ఆశించినంత మేరకు విజయాన్ని అందుకోలేదు. ఆ దర్శకుడే ఇప్పడు “అంటే సుందరానికి” సినిమా హీరో తో మరో సినిమా నిర్మించాడు.
అప్పుడు ప్లాప్ అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా “సరిపోదా శనివారం” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో హీరో ఒక్కడే కావడం విశేషం. ఆ హీరో శనివారం యముడు అంటే మాస్, క్లాస్ హీరో అయినటువంటి హీరో ” నాని ” . ఈ సినిమాలో నాని రెండు విధాలుగా కనిపించనున్నాడు. ఆ నాని నే శనివారం యముడు కూడా. ఇంతకు ఆ కథ ఏమిటో తెలుసుకుందాం…..
“సరిపోదా శనివారం” సినిమాలో హీరో నానికి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం మనిషికి మంచిది కాదు. మంచి కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి కోపం తగ్గించుకోవాలని చెప్పిన వినిపించికోడు హీరో నాని. చివరకు తల్లి ఒప్పిస్తుంది. అన్నిరోజులు కోపంతో ఉండ కుండా కేవలం వారంలో ఒక్క రోజు కోపంతో ఉండమని కోరుతుంది.
అందుకు నాని తల్లి మాటకు కట్టుబడి వారంలో వచ్చే శనివారం కోపంతో ఉంటాడు.
అందుకే ఆ సినిమా పేరు “సరిపోదా శనివారం” అనే పేరు పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు వివేక్ . అందుకే శనివారం కోపంతో ఉంటాడు కాబట్టి యముడి రూపంలో నాని వస్తున్నాడు సినిమా లో సన్నివేశం కొనసాగుతుంది.