BJP Gadkari : భారతీయ జనతా పార్టీ చార్ సౌ పార్ అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రంలో దూకింది. మిత్రపక్షాల మద్దతు లేకుండానే కేంద్రంలో పరిపాలన చేపడుతామనే నమ్మకంతో ఉంది బీజేపీ. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాలో ఉంది. అందుకు తగిన ప్రచారం కూడా చేపట్టారు.
తాజా ఎన్నికల్లో మిత్రుల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతలేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. బీజేపీ కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం కూడా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనల నేపథ్యంలో కాషాయం కూటమిలో జరిగే పరిణామాలు మాత్రం సంచలనం అవుతున్నాయి.
కేంద్రంలో వరుసగా రెండు దఫాలుగా అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు మోదీ- అమిత్ షా అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆగ్రహంతో ఉన్నట్టు బీజేపీ శిభిరంలో ప్రచారం సాగుతోంది. పార్టీ లో ఆరెస్సెస్ , మోదీ వర్గాలుగా రెండుగా చీలిపోయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడం విశేషం. RSS పెద్దలతో నితిన్ గడ్కరీ కి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని గమనించిన మోదీ, అమిత్ షా లు గడ్కరీ ని దూరం పెట్టారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
నాగపూర్ నుంచి బరిలో ఉన్న గడ్కరీ ని ఓడించడానికి అక్కడ అనారోగ్య వాతావరణాన్ని సృష్టించారనే ఆరోపణలు సైతం వచ్చాయి. గడ్కరీని ఓడించడానికి ఆయనకు అనుకూలంగా ఉన్న 1.5 లక్షల ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. RSS తో తత్సంబందాలు ఉన్న గడ్కరీ గెలుపు కోసం ఆయన నియోజక వర్గంలో మోదీ, అమిత్ షా ప్రచారం సైతం చేయలేదనే ఆరోపణలు సైతం వచ్చాయి.
ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై సంఘ్ పరివార్ దృష్టి సారించింది. జూన్ నాలుగున వచ్చే ఫలితాల ఆధారంగా కొత్త నిర్ణయాలను సంఘ్ పరివార్ తీసుకోబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా వస్తే సరిపెట్టుకుంటుంది. రానిచో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఘ్ పరివార్ ప్రయత్నాలు చేస్తోంది. ఆ అవకాశం మిత్ర పక్షాలతో కలిసి వచ్చిన నేపథ్యంలో నితిన్ గడ్కరీ ని ప్రధాని పీఠం పై కూర్చో పెట్టడానికి పరివార్ ఆలోచనలో ఉన్నట్టు విస్తృత ప్రచారం బీజేపీ
తో పాటు సంఘ్ పరివార్ లో సాగుతోంది.