Home » New Smart Phone : ఆరువేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

New Smart Phone : ఆరువేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

New Smart Phone : ప్రతి వ్యక్తి చేతిలో ఈ రోజుల్లో మొబైల్ లేనిదే ఏ పని కావడం లేదు. వ్యక్తుల అభిరుచులకు తగినట్టుగా కంపెనీలు ఫోన్ తయారు చేస్తున్నాయి. అదేవిదంగా వ్యక్తుల అవసరాలకు తగిన విదంగా స్మార్ట్ ఫోన్ తాయారు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ల తయారీలో పలు కంపెనీలో పోటీ పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లను సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. పోటీ నేపథ్యంలో ఫోన్ ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇప్పుడు మార్కెట్ లో చైనా పేరు మారుమోగుతోంది. రెడ్ మీ మార్కెట్ లోకి కొత్త ఫోన్ ప్రవేశ పెట్టింది. అతి తక్కువ ఖరీదులో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. కొత్త గా మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ ఫోన్ ధర ఎంత, అందులో ఎలాంటి ఫీచర్ లు ఉన్నాయి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…..

రెడ్‌మీ A 3 ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఇండియా మార్కెట్ లోకి ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది ఇంకా సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫీచర్ లను మాత్రం వినియోగదారులకు అనుకూలంగానే ఏర్పాటుచేశారు. మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండేవిదంగా ఉత్పత్తి చేస్తున్నారు. యువత కూడా ఆకట్టుకునే విదంగా ఈ ఫోన్ తయారు చేశారు. కనీసం పది వేల రూపాయలు లేనిదే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ రావడం లేదు. అటువంటిది రెడ్ మీ సంస్థ పోటీ సంస్థలకు దీటుగా కొత్త మోడల్ తో పాటు సరికొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే ఫోన్ ప్రవేశ పెట్టడం విశేషం.

6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ ఉంది. యూనిసోక్‌ టీ603 ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. అరోరా గ్రీన్, మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిడ్‌ నైట్ వైట్‌ రంగులలో తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ చేయడానికి ఈ ఫోన్ లో 5 మెగాపిక్సెల్స్‌తో ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరాను కూడా ఇందులో పొందుపరిచారు. 4 GB ర్యాం ప్రస్తుతానికి అందుబాటులో ఉంటుంది.

అవసరమనుకుంటే 8 GB వరకు కూడా పెంచుకునే అవకాశం కల్పించారు తయారీ సంస్థ. ఇంటర్నల్ మెమోరీ ని కూడా 1 TB వరకు సవరించుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్ లో వైఫై కనెక్షన్ తోపాటు బ్లూటూత్‌ 4.2, జీపీఎస్‌, గ్లోనాస్‌, గెలీలియో, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి సరికొత్త ఫీచర్స్‌ను అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత ఫేక్ అన్ లాక్ ఫీచర్‌కు కూడా ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తూ పనిచేస్తుంది. ప్రస్తుతం దీని ధర
రూ: 5500 నుంచి 6000 మద్య ఉండే అవకాశం ఉందని సంస్థ మార్కెటింగ్ అధికారులు కొందరు ప్రకటించారు.

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *