Harish Rao : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రుణ మాఫీ పై ప్రకటన చేశారు. ఆగష్టు 15 తేదీ లోగా రుణ మాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు విడితల్లో రైతులకు రుణమాఫీ పూర్తయినది. కానీ కొందరికి మాత్రం వివిధ కారణాలతో ఋణం మాఫీ కాలేదు.
రుతులు ఆశించిన మేరకు రుణ మాఫీ జరుగలేదని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైనదని మాజీ మంత్రి ఆరోపించారు. గడువు ముగిసినప్పటికీ హామీ అమలుకాలేదని హరీష్ రావ్ ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ రైతుల రుణ మాఫీ చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలుకాలేదని హరీష్ రావ్ ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళితే అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ఒట్టు వేసి రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. గడువు ముగిసినా రుణమాఫీ కాలేదు. కాబట్టి సీఎం దేవుళ్ళమీద ఒట్టు వేసినందుకు ఆ పాపం రాష్ట్రానికి చుట్టుకుంటుంది హరీష్ రావ్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి చుట్టుకుంటే ఆ పాపం ప్రజలకు కూడా తగులుతుందని, కాబట్టి తామే దేవుళ్ళ వద్దకు వెళ్తామన్నారు హరీష్ రావ్. రాష్ట్ర ప్రజలకు శాపం తగలకూడదనే ఉద్దేశ్యంతో తామే రాష్ట్రంలోని దేవాలయాలతోపాటు మసీదులు, చర్చిల వద్దకు వెళ్లి క్షమించమని దేవుళ్లను కోరుతామన్నారు.
రుణమాఫీ కాలేదని అనేక మంది రైతులు రాష్ట్రంలోని బిఆర్ఎస్ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి అందరికంటే ముందు ఉంటారన్నారు. అబద్దాలు చెప్పడంలో సీఎం ముందు ఉంటారన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హోదాకు తగినట్టుగా మాట్లాడాలని కోరారు. ఆయన ప్రవర్తన
సీఎం పదవికే కళంకం తెస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకుంటే బాగుంటదని మాజీ మంత్రి హరీష్ రావ్ హితువు కోరారు.