Home » Shanku pooja : శంఖం ఎప్పుడు కొనుగోలు చేసి పూజ చేయాలో తెలుసా ???

Shanku pooja : శంఖం ఎప్పుడు కొనుగోలు చేసి పూజ చేయాలో తెలుసా ???

Shanku pooja : పూజ సమయాల్లో ఎవరికి ఇష్టమైన వస్తువులను వారు కొనుగోలు చేసి పూజిస్తారు. కొన్ని సమయాల్లోనే వస్తువులను కొనుగోలు చేసి, పూజలు చేస్తేనే ప్రతిఫలం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. అందులో శంకం కూడా ఒకటి కావడం విశేషం. శంకంను ఎప్పుడు కొనుగోలు చేయాలి. ఇంటిలో ఏ దిక్కున పెట్టుకోవాలి. ఎప్పుడు పూజ చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శంఖం అంటే శివునికి చాలా ఇష్టం. అదేవిదంగా లక్ష్మీ దేవికి కూడ ఇష్టమే. శంఖం పూజించే వారికి లక్ష్మి దేవి తన కటాక్షాన్ని ఎల్లవేళలా ప్రసాదిస్తుంది అని వేదంలో చెప్పబడింది. క్షీర సాగర మధనం నుండి వచ్చిన శంఖం. కాబట్టి శంఖం కు వేదంలో ఒక ప్రత్యేకత ఉంది.

ఇంటిలో శంఖాన్ని తూర్పు దిక్కున పెట్టి పూజ చేయాలి. ఇంటిలో పెట్టుకోవడం వలన ఆరోగ్యం, సంపద పెరుగుతుంది. శంఖ పూజ చేయడం వలన ధన ప్రవాహం పెరుగుతుంది. నిత్యం పూజ చేయడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని వేదంలో చెప్పబడింది.

శంఖాన్ని ఎరుపు లేదంటే పసుపు రంగు వస్త్రం పై పెట్టాలి. శంఖం పైకి చూసే విదంగా ఉండాలి. శంఖాన్ని పూరించిన అనంతరం ఏదయినా నది జలంతో శుభ్రం చేయాలి.

దీపావళి పండుగ కంటే ముందుగానే శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా కొనితెచ్చుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *