Home » ఆ ఇద్దరికీ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమే…

ఆ ఇద్దరికీ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమే…

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవి. మూడు పార్టీలు ఛాలెంజ్ గ తగిసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నవి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు వచ్చేనెల 13న ఎన్నికలు జరుగనున్నాయి.పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఉహించినంత రాజకీయప్రభావం చూపేవి కావు.రాష్ట్రంలో గులాబీ పార్టీ గద్దె దిగడం,కాంగ్రెస్ పరిపాలన పగ్గాలు చేపట్టడం జరిగింది.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కు,కాంగ్రెస్ కు జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఛాలంజ్ గ నిలిచాయి.పదేళ్ల కేసీఆర్ పరిపాలన రాష్ట్రంలో ఏవిదంగా జరిగిందో ప్రజలు గమనించారు. తాజాగా రేవంత్ రెడ్డి గడిచిన నాలుగునెలల పాలనను కూడా ప్రజలు గమనిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారధ్యంలో పదికి పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రజల ఆశీర్వాదం పొందాలని కలలు కంటోంది కాంగ్రెస్ పార్టీ. కాషాయం పార్టీ కూడా రెండంకెల స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాలో ఉంది. బిఆర్ఎస్ మాత్రం రెండు లేదా మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.ఎంఐఎం తన ఒక్క సీటు ను ఎలాగూ కాపాడుకుంటుంది. అందులో సందేహమే లేదు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు కనీసం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించినా సీఎం పరిపాలన పై ప్రజలకు విశ్వాసం ఉన్నట్టే.ఒక పార్లమెంట్ స్తానంలో అభ్యర్థి విజయం సాధించిన దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీ పుంజుకున్నట్టే అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది.అంటే ఆ మూడింటితో పాటు కనీసం మరో ఐదు గెలుచుకున్నా రేవంత్ రెడ్డి పరిపాలనవైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు అవుతుంది.

ఒకవేళ గులాబీ అభ్యర్థులు మూడు సీట్ల లోపే తమ బలాన్ని నిరూపించుకుంటే కేసీఆర్ నాయకత్వం పై ప్రజలు అసెంబ్లీ తీర్పు ఇచ్చినట్టే అవుతుంది.అంతేకాదు పార్టీలో కూడా ఆయన బలహీనపడినట్టు అవుతుంది.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పక్కదారి పాడుతారు.కనీసం సగం స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తేనే పార్టీ పుంజుకున్నట్టవుతుంది.అంతేకాదు కేసీఆర్ మళ్ళీ ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఉత్తర ప్రగల్బాలు పలుకుతారు. కాబట్టి ఈ ఎన్నికలు అటు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు మాజీ సీఎం కేసీఆర్ కు ప్రతిష్టాత్మకమైనవి.ఈ ఎన్నికలలో బీజేపీ కూడా 5-6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెపుతుండటం దానికి చాలా మంచి వార్తే. కానీ ఈసారి కూడా కేంద్రంలో మళ్ళీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని సర్వేలు సూచిస్తున్నందున తెలంగాణలో దాని గెలుపోటములు ఆ పార్టీపై పెద్దగా ప్రభావం చూపవు.

బిజెపి చేపట్టిన సర్వేల అధారంగా ఆ పార్టీ రెండంకెల స్థానాల్లో కాషాయం జెండా ఎగురవేస్తుందని చెబుతున్నాయి.ఇది ఆ పార్టీకి శుభ పరిణామమే అవుతుంది. ముచ్చటగా కేంద్రంలో బిజెపి మూడోసారి కూడా అధికారాన్ని చేపడుతుందని ఆ పార్టీ పెద్దలతోపాటు,సర్వేలు కూడా చెబుతున్నాయి .ఏది ఏమైనప్పటికిని రాష్ట్రంలో బిజెపి గెలుపు,ఓటమిలు ఆ పార్టీకి పెద్దగా ప్రభావం చూపే విదంగా ఉండవని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *