NIGAMA MEDIA (P) LTD
1.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 23, 2026

కృష్ణా జలాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది
తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడటంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమవుతున్నారని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటని అన్నారు.

తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటా విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సాగునీరు, తాగునీటి అవసరాలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదని పేర్కొన్నారు.అపెక్స్‌ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు న్యాయబద్ధంగా, సామరస్యపూర్వకంగా జరగాలని కొమురయ్య యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ నీటి హక్కులను గౌరవిస్తూ, రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు సహకరించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల పోరాటంతో సాధించుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని గుర్తుచేశారు. అలాంటి తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల విషయంలో రాజీపడితే ప్రజలు సహించరని హెచ్చరించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా మౌనం వీడి, కృష్ణా జలాల అంశంపై అఖిలపక్ష నాయకులతో చర్చించి రాష్ట్ర హక్కులను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాటం చేస్తుందని సలేంద్ర కొమురయ్య యాదవ్ స్పష్టం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.