కృష్ణా జలాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి విఫలం
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడటంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమవుతున్నారని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటా...