NIGAMA MEDIA (P) LTD
6.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 14, 2026

మందమర్రిలో సీఐటీయూకు సెక్యూరిటీ సిబ్బంది బలం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కార్మిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తాం
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి ఏరియాలో రోజురోజుకూ బలోపేతమవుతోందని యూనియన్ జనరల్‌ సెక్రటరీ కామ్రేడ్ తుమ్మల రాజారెడ్డి అన్నారు. సీఐటీయూ విధానాలు, కార్మికుల కోసం చేస్తున్న పోరాటాలను తెలుసుకుని సెక్యూరిటీ సిబ్బంది స్వచ్ఛందంగా యూనియన్‌లో చేరడం అభినందనీయమన్నారు. మందమర్రి ఏరియాలో సెక్యూరిటీ సిబ్బంది సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ బ్రాంచ్ ఉపాధ్యక్షులు దెబ్బటి శ్రీనివాస్, లింగాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్ నాయకత్వంలో యూనియన్‌లో చేరారు. చింతం భూమయ్య, మహమ్మద్ అజీజ్, జూపాక శ్రీనివాస్, బండిపెల్లి రమేష్, జి. సురేష్, బోగ లక్ష్మణ్ తదితరులను జనరల్‌ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సింగరేణి ఎన్నికలు జరిగితే మందమర్రి ఏరియాలో సీఐటీయూ విజయం ఖాయమన్నారు. సంస్థలో ఉత్పత్తి విభాగంతో పాటు సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి సిబ్బందికి గత 12 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల సెక్యూరిటీ విభాగం నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.సెక్యూరిటీ సిబ్బంది క్యాడర్‌ స్కీమ్‌ కోసం గతంలో కొత్తగూడెం వరకు వెళ్లి పోరాటం చేశామని, భవిష్యత్‌లోనూ క్యాడర్‌ స్కీమ్‌లో మార్పుల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ బోర్డును గోదావరిఖని, కొత్తగూడెంలో ఏర్పాటు చేయడం మాత్రమే గొప్ప విషయం కాదని, ఇన్‌వాలిడేషన్ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు రీ-మెడికల్ బోర్డుకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా ఏడాది వేచి ఉండాలనే నిబంధనను పూర్తిగా తొలగించాలని కోరారు.

దసరా సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంతింటి కలను నెరవేర్చుతామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని రాజారెడ్డి అన్నారు. త్వరలోనే ఈ హామీ అమలుకు శంకుస్థాపన చేయకపోతే వినూత్న తరహాలో ఆందోళనలు, పోరాటాలు చేపడతామని, వాటిలో సింగరేణి కార్మికులందరినీ భాగస్వామ్యం చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు చెందిన వారైనా 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదన్నారు. కార్మికుల ఓపిక నశించకముందే 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు రామగిరి రామస్వామి, బుద్దె సురేష్, నాగవెల్లి శ్రీధర్, మహేందర్, జుట్టు అజయ్, బహుకర్, సోషల్ మీడియా ఇన్‌చార్జి భేతి భరత్‌తో పాటు పలువురు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.