కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణ పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి తమ ప్రతిభను చాటుకున్నారు. దీంతో పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పిల్లలే దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, మంచి నడవడిక, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించి ప్రోత్సహించారు. విద్యార్థుల ఉత్సాహం, ఆనందోత్సాహాల మధ్య బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

