కళ్యాణిఖనిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణ పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి తమ ప్రతిభను చాటుకున్నారు. దీంతో పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు...