NIGAMA MEDIA (P) LTD
11.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 12, 2026

సిద్దిపేటలో తెలంగాణ రక్షణ సేన జిల్లా కార్యాలయానికి భూమిపూజ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

భూమిపూజ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైనికులు తరలిరావాలి
తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ నెల 13న సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరావేన స్వప్న ముదిరాజ్ బుధవారం తెలిపారు.

సిద్దిపేటలోని రాజీవ్ రహదారి, రంగధామ్‌పల్లి అమరవీరుల స్తూపం సమీపంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా పరిధిలోని తెలంగాణ రక్షణ సేన సైనికులు, నాయకులు, కార్యకర్తలు విధిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిరావేన స్వప్న ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.