NIGAMA MEDIA (P) LTD
2.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 5, 2026

NHM ఉద్యోగులకు అల్పాహారం పంపిణీ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

తమ సమస్యల పరిష్కారం కోసం గత 24 రోజులుగా మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులకు అండగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నిలిచారు. ఈ సందర్భంగా అత్తి సరోజ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అత్తి సరోజ మాట్లాడుతూ, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, గత 24 రోజులుగా ఎండనకా, వాననకా తమ హక్కుల కోసం పోరాడుతున్న NHM ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యమిస్తున్న ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో WCDSE మంచిర్యాల జిల్లా మాజీ చైర్మన్ అత్తి సరోజ, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యెడ్ల శంకర్, రఫీక్, మాజీ కౌన్సిలర్ ఎండీ తాజుద్దీన్, బండి పద్మ, నస్పూర్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి, గంగులు, హజీమ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.