NIGAMA MEDIA (P) LTD
4.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 23, 2026

మందమర్రిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్‌ 174వ జయంతిని పురస్కరించుకుని గురువారం మందమర్రి ముదిరాజ్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కులపెద్దల సమక్షంలో పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకుంటూ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పట్టణ కమిటీ అధ్యక్షుడు నెల్లి రాజలింగు మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్న ప్రజా వీరుడిగా, పేదల పక్షాన నిలిచి పోరాడిన యోధుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. 19వ శతాబ్దంలో నిజాం పాలన కొనసాగుతున్న సమయంలో దొరలు, భూస్వాములు, పెత్తందారుల ఆధిపత్యం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఆయన జానపద చరిత్రలో ప్రసిద్ధి చెందారని తెలిపారు.

పండుగ సాయన్న ఆశయాలను, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జయంతి వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ఆయన చూపిన ధైర్యం, సేవాభావం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆకాంక్షించారు. యువత పండుగ సాయన్న జీవిత చరిత్రను తెలుసుకుని, ఆయన స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మందమర్రి ముదిరాజ్‌ పట్టణ కమిటీ అధ్యక్షుడు నెల్లి రాజలింగు, ప్రధాన కార్యదర్శి కట్ల శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, గనవీన స్వామి, అనవేన శంకర్‌, మస్కం సతీష్‌, పిడుగు రాజేందర్‌, పాతరవేన కుమార్‌, కందుల ఓదెలు, తొగరి కుమార్‌, పాలు సంపత్‌, కుమ్మం రాజేందర్‌, ఈరోవేన మల్లేష్‌, పాలు కుమారస్వామి, పల్లె మొగిళా, నూకపోతుల శ్రీనివాస్‌, కలవేన విశ్వనాథ్‌, రెడ్డి సతీష్‌, చిలుక ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.