మందమర్రిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతిని పురస్కరించుకుని గురువారం మందమర్రి ముదిరాజ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కులపెద్దల సమక్షంలో పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీ అధ్యక్షుడు నెల్లి రాజలింగు మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్న ప్రజా వీరుడిగా, పేదల పక్షాన నిలిచి పోరాడిన యోధుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు....