NIGAMA MEDIA (P) LTD
16.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 22, 2026

హెచ్ఐవీ నివారణకు అవగాహనే కీలకం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

దోమకొండ ఎంఈఓ విజయ్‌కుమార్

కోల్ బెల్ట్ న్యూస్(దోమకొండ):

హెచ్ఐవీ నివారణకు అవగాహనే ప్రధానమని దోమకొండ మండల విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం దోమకొండలోని బాలికల, బాలుర, పలుగడ్డ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి ఐసీటీసీ కౌన్సిలర్ మేక నాగరాజు మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వివరించడంతో పాటు, బాధితుల పట్ల వివక్ష చూపరాదని సూచించారు.

అనంతరం హెచ్ఐవీ, ఎస్టీఐ వ్యాధుల రిస్క్ అసెస్‌మెంట్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులు హెచ్ఐవీపై సరైన అవగాహన పెంపొందించుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీజీ హెచ్‌ఎంలు శరత్‌కుమార్, రాధాలక్ష్మి, జశ్వంత్‌రావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్ బాలకిషన్, ఎస్‌ఎస్‌కే ఔట్‌రీచ్ వర్కర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.