NIGAMA MEDIA (P) LTD
16.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 22, 2026

23న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం (సెప్టెంబర్‌ 23) ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో  పర్యటించనున్నారని బెల్లంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి బోడ జనార్దన్, సలేంద్ర కొమురయ్య యాదవ్ లు తెలిపారు. ఇటీవల రిమ్స్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.

కవిత ఉదయం 9 గంటలకు ఇచ్చోడకు చేరుకుని, అక్కడ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వెళ్లి బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఉట్నూర్‌లో మరో చిన్నారి కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు.

అనంతరం ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించి, ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించనున్నారు. అలాగే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పర్యటన ముగింపులో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడనున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.