కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియా వర్క్‌షాప్ ఏఐటీయూసీ పిట్ కమిటీ రివ్యూ సమావేశం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్క్‌షాప్‌లోని వివిధ సెక్షన్ల ఇన్‌చార్జీలు తమ సెక్షన్లలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంతవరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ తెలిపారు.
సమావేశంలో సుమారు 60 మంది కమిటీ సభ్యులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని, రానున్న రోజుల్లో యూనియన్ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తూ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకత్వం వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపింది.

వర్క్‌షాప్‌లో కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పిట్ కార్యదర్శి శర్మ సేవలను కమిటీ సభ్యులు, కార్యకర్తలు అభినందించారు. ఆయనను మరోసారి పిట్ కార్యదర్శిగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనిపై బ్రాంచ్ నాయకత్వం కూడా స్పందించి శర్మను పిట్ కార్యదర్శిగా కొనసాగించాలని తీర్మానించింది. ఈ సమావేశంలో బ్రాంచ్ నాయకులు కంది శ్రీనివాస్, పెద్దపెల్లి బానయ్య, టేకుమట్ల తిరుపతి, ఎక్కేటి రాజేశ్వరరావు, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ ములకలపల్లి వెంకటేశ్వర్లు, తోట వెంకటస్వామితో పాటు వివిధ సెక్షన్ల ఇన్‌చార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

